Telangana | సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సవాల్
Telangana | సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సవాల్
Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రాష్ట్రంలో ప్రకటించిన 6 గ్యారెంటీల అమలుపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది.
బండి సంజయ్ మాట్లాడుతూ… రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలను పూర్తిగా అమలు చేస్తే తాను రాజీనామా చేయడానికి సిద్ధమని తెలిపారు. అదే విధంగా ఈ హామీలు అమలు కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు.
కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. గతంలో బీహార్, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఇలాంటి హామీలతో ప్రజలను మోసం చేయడంతో ఓటమి పాలైందని వ్యాఖ్యానించారు.
ఇక తెలంగాణలోని ఏ గ్రామానికైనా కేరళ మీడియాను తీసుకెళ్లేందుకు తాను సిద్ధమని, అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా చూపిస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. తన సవాల్‌ను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించాలని ఆయన డిమాండ్ చేశారు.
