హైదరాబాద్ జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు హెలికాప్టర్ లో శివునిపల్లెకు చేరుకోనున్నారు సీఎం.
అక్కడ ఏర్పాటు చేసిన ఇందిరామహిళా శక్తి స్టాల్స్‌ను పరిశీలించనున్నారు. అనంతరం.. రూ.800 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు. కాగా.. సీఎం టూర్ ఏర్పాట్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య పర్యవేక్షించారు. హెలిప్యాడ్, పార్కింగ్, భద్రత ఏర్పాట్లను సీపీ సన్ ప్రీత్ సింగ్ పరిశీలించారు.