Kaushik Reddy | విచారణ ప్రారంభం
Kaushik Reddy | విచారణ ప్రారంభం
Kaushik Reddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సీఐడీ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్న ఆయనను అధికారులు ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విచారణ కోసం హాజరయ్యారు. ఆయనతో పాటు ఆయన సతీమణికి కూడా సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేయడంతో, ఆమె కూడా విచారణకు హాజరయ్యారు.
ఎమ్మెల్యేను సీఐడీ డీఎస్పీ రంగస్వామి విచారిస్తున్నారు. జనవరి 29న సమక్క-సారలమ్మ జాతర సందర్భంగా హుజురాబాద్‌లో కౌశిక్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ ఘటనలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేశారు. తరువాత ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది. ఈ క్రమంలో విచారణకు హాజరుకావాలని సీఐడీ అధికారులు ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల మేరకు ఆయన ఇవాళ విచారణకు హాజరై వివరాలు తెలియజేస్తున్నారు.
