TG | బిఆర్ఎస్, సిపిఐ కౌన్సిలర్ ల హాజరు..

TG | బిఆర్ఎస్, సిపిఐ కౌన్సిలర్ ల హాజరు..

ఓటింగ్ కు కాంగ్రెస్ కౌన్సిలర్లు దూరం
హాజరుకాని మంత్రి, ఎంపీ
మున్సిపల్ చైర్మన్ గా సంధ్య రాణి
వైస్ చైర్మన్ గా మిట్టపల్లి సరిత
పట్టు నిలుపుకున్న బాల్క సుమన్

TG | క్యాతనపల్లి, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఖ్యాతనపల్లి మున్సిపాలిటీ గులాబీ ఖాతాలోకి చేరింది. మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పట్టు నిలుపుకున్నారు. శనివారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ కోసం జరిగిన ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి సిపిఐ సభ్యులు 14 మంది పాల్గొనగా కాంగ్రెస్ కౌన్సిలర్లు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఉన్న మంత్రి వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీ వంశీలు ఓటింగ్కు హాజరు కాలేదు.

22 మంది సభ్యులు ఉన్న క్యాతనపల్లి మున్సిపాలిటీలో భారత రాష్ట్ర సమితి సిపిఐ సభ్యులు 14 మంది గెలువగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు గెలుపొందగా ఒకరు స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఎన్నిక సందర్భంగా పెద్ద ఎత్తున గొడవలు జరగగా ఎన్నిక ప్రక్రియను నిలిపివేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో పాటు పలువురిని కేసు నమోదు చేసి జైలుకు తరలించిన విషయం విధితమే. న్యాయస్థానం ఆదేశాల మేరకు నిర్వహించిన ఎన్నికలో మున్సిపల్ చైర్మన్ గా సంధ్యారాణి రాజా రమేష్, వైస్ చైర్మన్గా సరిత శ్రీనివాస్ లు గెలుపొందారు.

ఎంతో ఉత్కంఠ రేపిన క్యాతనపల్లి మున్సిపాలిటీ గులాబీ ఖాతాలోకి వెళ్లడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ఎన్నిక సందర్భంగా ఇన్చార్జిగా కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ మరో శాసనసభ్యురాలు కోవా లక్ష్మీ లకు పార్టీ అధిష్టానం బాధ్యత అప్పగించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కోవా లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ లు మాట్లాడుతూ… న్యాయం గెలిచిందన్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా విజయం తమకే దక్కిందన్నారు.

Leave a Reply