TG | రేవంత్ తో మీనాక్షి భేటి…

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ శుక్రవారం సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఈ భేటీ జరిగింది. ఇరువురు నేతల మధ్య దాదాపు గంటకు పైగా చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, మంత్రివర్గ విస్తరణ అవకాశాలు, అలాగే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ)కి సంబంధించిన వివిధ కమిటీల నియామకం వంటి కీలక అంశాలపై వీరిద్దరూ సమాలోచనలు జరిపినట్లు స‌మాచారం.. గత పది రోజులుగా పార్టీ నేతలతో మీనాక్షి నటరాజన్ సొంతంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. వాటికి సంబంధించిన వివ‌రాల‌ను రేవంత్ కు అందించిన‌ట్లు స‌మాచారం

నేటి సాయంత్రం ఆలేరులో సిఎం ప‌ర్య‌ట‌న…
యాదాద్రి జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం, తిరుమలాపురంలో గంధమల్ల రిజర్వాయర్ పనులకు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం తిరుమలాపురంలో పబ్లిక్ మీటింగ్ లో పాల్గొననున్నారు. మీటింగ్ అనంతరం చాపర్ లో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం రేవంత్.
సీఎం టూర్ నేపథ్యంలో రాచకొండ కమిషనర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుమలాపూర్ లో భారీ బహిరంగ సభ నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్ విధించారు. ప్రజ్ఞాపూర్ – భువనగిరిల మధ్య వాహనాల రాకపోకలు నిలిపివేశారు. భువనగిరి నుంచి ఓఆర్ఆర్ మీదుగా వాహనాలను మళ్లించారు.

Leave a Reply