నూతన బోర్వెల్ ను పరిశీలించిన చైర్మన్ సర్పంచ్ లు
సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ ; ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కృషితో సిర్పూర్ (యు) మండలం రాగాపూర్ పంచాయతీలోని భీమ్ గూడలో నూతన బోర్వెల్ వేయడం జరిగిందని జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాత్ రావు రాగాపూర్ సర్పంచ్ ఆత్రం విజయలక్ష్మి బీర్షావ్ అన్నారు.
ఆ గ్రామంలో నూతనంగా చేసిన బోర్వెల్ ను శుక్రవారం చైర్మన్ సర్పంచులు ఆ గ్రామాన్ని సందర్శించి పరిశీలించారు. నీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని చైర్మన్ అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, నాయకులు విజయలక్ష్మి, ఆత్రం మీరా జాలింషా, గణపత్ రావు, మా డావి లక్ష్మణ్ సెడమ్మకి జానే రావు,మెస్రం భూపతి, ఆత్రం అనిల్, తదితరులు పాల్గొన్నారు.
