ప్రజా దర్బార్ లో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి..

ప్రజా దర్బార్ లో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి..

…మంత్రి ఎన్ఎండి ఫరూక్..

నంద్యాల , ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడి కుటుంబం తీవ్రంగా కృషి చేస్తుందని ఏదైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకోవస్తే వాటిని పరిష్కరిస్తానని రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ పేర్కొన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ వేదిక ద్వారా పలువురు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి మంత్రివర్యులు ఫరూక్ స్వయంగా అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో ఎటువంటి జాప్యం ఉండకూడదన్నారు. అధికారులు ప్రజలు కు అందుబాటులో ఉండాలని వారి కోసం సేవ చేయాలని సూచించారు.ఇచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఆయన తక్షణమే ఆయా సమస్యలకు సంబంధించిన శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వం తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున నిరంతరం కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

Leave a Reply