సర్పంచ్ లహరిక ఆత్మహత్యాయత్నం..

కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కడెం మండలం మాసాయిపేట్ గ్రామ సర్పంచ్ దుర్గం లహరిక పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో కారు అదుపుతప్పి రోడ్డుపై నిలిపి ఉన్న ట్రాక్టర్ నాగళ్లను ఢీకొట్టింది.

అయితే ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో వెంటనే మరో వాహనంలో లహరికను ఖానాపూర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నప్పటికీ లహరిక మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనకు గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply