గుడ్ ఫ్రైడే, ప్రత్యేక ప్రార్థనలు..
గుడ్ ఫ్రైడే, ప్రత్యేక ప్రార్థనలు..
అవనిగడ్డ – ఆంధ్రప్రభ : అవనిగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలోని కోటగిరిలంక ఆర్సీఎం చర్చ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న అవనిగడ్డ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, రాష్ట్ర రైతు విభాగం రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారు, గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆర్సీఎం చర్చ్ సంఘస్థులతో కలసి సిలువ మొస్తూ క్రీస్తుయేసు చూపించిన ప్రేమ, శాంతి, క్షమా గుణాలను మన జీవితాల్లో ఆచరిస్తూ, సమాజంలో మంచి విలువలను వ్యాప్తి చేయాలని ఈ పవిత్ర దినాన క్రీస్తు మార్గంలో నడుస్తూ, ధర్మం మరియు మానవత్వాన్ని కాపాడుదాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలోని ప్రజా ప్రతినిధులు మరియు వివిధ హోదాలలోని పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక గ్రామస్థులు, చర్చ్ సంఘస్థులు తదితరులు పాల్గొన్నారు.
