అభయాంజనేయుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే వేముల..

వేల్పూర్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో హనుమాన్ జయంతి పురస్కరించుకుని వేల్పూర్ మండల కేంద్రంలోని జంబీ హనుమాన్ అభయాంజనేయ స్వామి ఆలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాల్కొండ నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని, ప్రజలకు ఆయురారోగ్యాలు కలగాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.

వేడుకల సందర్భంగా ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమోగింది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply