మాదక ద్రవ్యాల నియంత్రణ ప్రతి పౌరుని బాధ్యత..
- కమ్మర్ పల్లి ఎస్ఐ సిహెచ్ సతీష్
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాల పై యువత, విద్యార్థులకు అవగాహన కలిగి ఉండాలని కమ్మర్ పల్లి ఎస్ఐ సిహెచ్. సతీష్ అన్నారు.అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ సీపీ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు, కమ్మర్పల్లి ఎస్ఐ సిహెచ్. సతీష్ ఆద్వర్యంలో కమ్మర్పల్లి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల విధ్యార్థులకు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నిరోధానికి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు.

మాదక ద్రవ్యాల రవాణకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.మాదక ద్రవ్యాల భారిన పడకుండా ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థితులు పొందాలని సూచించారు. విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తూ,క్రీడల ప్రాముఖ్యతను వివరించారు.మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ,విద్యార్థులు తమ లక్ష్యాల వైపు పయనించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన చిత్రలేఖనం పోటీలు మరియు వాలీబాల్ పోటీలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయన్న,ఉపాద్యాయులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
