మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి అడ్లూరి..
జగిత్యాల, ఆంధ్రప్రభ : ధర్మపురి పట్టణ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ధర్మపురి పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు మరణించగా మృతుల కుటుంబాలను గురువారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మృతుల కుటుంబాలను పరామర్శించారు.
ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ముగ్గురు యువకుల కుటుంబాలను మంత్రి పరామర్శించి ఓదార్చారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఆదుకుంటామని మంత్రి తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి పోలీసులకు సూచించారు.
ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని మంత్రి ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. మంత్రి వెంట జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్ తో పాటు ధర్మపురికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
