ప్రజాకవి, గాయకుడు ఎండి జహంగీర్ మృతి..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రానికి చెందిన ప్రజాకవి, గాయకుడు, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు ఎండి జహంగీర్ గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన ఆటపాటలతో ఉర్రూతలూగించిన కళాకారునిగా ఆయన ఆలేరు ప్రాంతంలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా పేరు పొందారు.

సుదీర్ఘకాలం ప్రజానాట్యమండలి కళాకారునిగా కూడా పని చేశారు. తెలంగాణ సాంస్కృతిక సారధిలో కళాకారునిగా కూడా సేవలు అందిస్తున్నారు. జహంగీర్ ఆకస్మిక మృతి పట్ల పలువురు కవులు, కళాకారులు, గాయకులు, ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు, జర్నలిస్టులు, యువజన స్వచ్ఛంద సంఘాలు,మాజీ ప్రజా ప్రతినిధులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. జహంగీర్ మృతి కళా సాంస్కృతిక ఉద్యమరంగాలకు తీరని లోటని వారు చెప్పారు.