Amaravati | వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి లక్ష్యం

Amaravati | వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి లక్ష్యం

Amaravati | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు ప్రజలకు ఇది చరిత్రాత్మక రోజు అని పేర్కొన్నారు.

రాజ్యసభలో అమరావతి బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కింజరపు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాజధాని లేకుండా వదిలేయడం వల్ల సమస్యలు మొదలయ్యాయని అన్నారు.

తాము విభజనకు వ్యతిరేకం కాదని, అయితే అది అమలు చేసిన విధానం సరిగా లేదని అభిప్రాయపడ్డారు. వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ప్రజలను గందరగోళానికి గురి చేసిందని విమర్శించారు. అమరావతిని ఐకానిక్, వరల్డ్ క్లాస్ రాజధానిగా అభివృద్ధి చేయడం ఏపీ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. తెలుగు ప్రజలకు ఈ రోజు చారిత్రాత్మకమని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply