5 Gulf Countries : గల్ఫ్ కంట్రీస్ గజగజ Andhra Prabha War Story

5 Gulf Countries : గల్ఫ్ కంట్రీస్ గజగజ Andhra Prabha War Story
- ఇదిగో డ్రోన్..
- అదిగో మిసైల్..
- గాలిలో జెట్ల మోత
- బంకర్లకు జనం పరుగో పరుగు
- అమెరికా మిత్రుల్ని వదలం : ఇరాన్ వార్నింగ్
( ఆంధ్రప్రభ, దోహ ప్రతినిధి)

అమెరికా ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్ ఎథిక్ ప్యూరీపై ఎదురు దాడకి దిగిన ఇరాన్ ,,గల్ఫ్ కంట్రీస్ పై ప్రతాపం చూపిస్తోంది. అమెరికాకు విడిది స్థావరాలను ఏర్పాటు చేసిన దేశాల కంటిమీద కునుకు పడనీయటం లేదు. ఇప్పటికే ఈ ఆపరేషన్ 32వ రోజుకు చేరుకోగా.. గల్ఫ్ దేశాల ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. చమురు కోసం ప్రపంచ దేశాలు ల్లడిల్లిపోతున్నాయి.

ఇక గడచిన 24 గంట్లో గల్ఫ్ దేశాల్లో అలజడి వర్ణనాతీతంగా మారింది. దుబాయ్‌లో సోమవారం సాయంత్రం 6.00 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజామున 2,00 గంటల వరకు భారీ పేలుళ్లు జనాన్ని కకావికలం చేశాయి. ఈ దాడుల్లో దుబాయ్ తీరంలోని ఆయిల్ ట్యాంకర్ పేలిన శబ్ధం వినిపించి జనం కంగారెత్తి పోయారు.

ఫిబ్రవరి 28 నుంచి గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్ లు, క్షిపణులతో విరుచుకుపతున్న స్థితిలో. గల్ఫ్ దేశాల్లోని ప్రజలు అత్యంత అప్రమత్తం అవుతున్నారు. క్షణక్షణం క్కుబిక్కుమంటున్నారు. ఆకాశంలో సైనిక జెట్‌ల గస్తీ విమానాల హోరుతో బేంబేలెత్తి పోతున్నారు. సోమవారం ఉదయం, సౌదీ అరేబియాలోని రాస్ తానూరా తీరానికి సమీపంలోని గ్రీకు కంటైనర్ నౌకపై రెండు వేర్వేరు క్షిపణులు దూసుకు వచ్చాయి. కానీ అవి నీటిలో పడ్డాయని సముద్ర భద్రతా నిపుణులు తెలిపారు.
5 Gulf Countries : 5 దేశాలు బిక్కు బిక్కు

ఇక హోర్ముజ్ జలసంధి సమీపంలో క్షిపణి దాడితో థాయ్ సరుకు రవాణా నౌక లోని ముగ్గురు సిబ్బంది గల్లంతు అయ్యారు. గాలింపు బృందం నౌకలోకి ప్రవేశించి తనిఖీ చేస్తే ఆ ముగ్గురు సిబ్బంది జాడ తెలియలేదు. ఈ నెల ఆరంభంలో ఒమన్‌కు ఉత్తరాన క్షిపణి దాడికి గురైన తర్వాత ‘మయూరీ నారీ’ నౌక నిలిచిపోయింది.ఇక మంగళవారం గత కొన్ని గంటల వ్యవధిలో సౌదీ అరేబియా, ఖతార్ , బహ్రెయిన్ సహా గల్ఫ్ అంతటా “అనేక దాడులు” జరిగాయి.

“యూఏఈ దుబాయ్‌లోని అల్ బదా ప్రాంతంలో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి, సోమవారం రాత్రి తమపై దాడులు జరిగాయని క్షిపణులు, డ్రోన్‌లను అడ్డుకున్నామని ఖతార్, కువైట్, బహ్రెయిన్ దేశాలు ప్రకటించాయి.” సౌదీ అరేబియా మంగళవారం కొత్త దాడుల పరంపరలో 10 డ్రోన్‌లను , 8 బాలిస్టిక్ క్షిపణులను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకుని ధ్వంసం చేశాయని సౌదీ అరేబియా తెలిపింది.
5 Gulf Countries : పౌదీలో.. ఆక్రోశం

“గత కొన్ని గంటల్లో పది డ్రోన్‌లను అడ్డుకుని ధ్వంసం చేశాం,” అని సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రియాద్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్న ఏడు బాలిస్టిక్ క్షిపణులను, తూర్పు ప్రావిన్స్‌ను లక్ష్యంగా చేసుకున్న ఒక క్షిపణిని కూడా అడ్డుకుని ధ్వంసం చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.
5 Gulf Countries : అమెరికా మిత్రుల్ని వదలం

ఈ ప్రాంతమంతటా జనవాసాల లక్ష్యాలపై దాడులు జరిగినప్పటికీ, గల్ఫ్ అరబ్ దేశాలపై ఇరాన్ దాడులు కేవలం అమెరికా దళాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి మంగళవారం నొక్కి చెప్పారు. సౌదీ అరేబియా రాజ్యాన్ని ఇరాన్ గౌరవిస్తుంది, ఆ దేశాన్ని ఒక సోదర దేశంగా పరిగణిస్తుంది,” అని మంత్రి అబ్బాస్ అరాఘ్చి పోస్ట్ చేశారు. ఆ రాజ్యంలో ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ వద్ద దెబ్బతిన్న ఒక అమెరికా విమానం ఫోటోను ఆయన పంచుకున్నారు. “అరబ్బులను గానీ, ఇరానియన్లను గానీ గౌరవించని, ఎలాంటి భద్రతను అందించలేని శత్రు దురాక్రమణదారులను లక్ష్యంగా చేసుకుని మా కార్యకలాపాలు ఉన్నాయి… అమెరికా బలగాలను తరిమికొట్టడానికి ఇదే సరైన సమయం. అని వ్యాఖ్యానించారు.
