మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి..
మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి..
దండేపల్లి, ఆంధ్రప్రభ : అకాల వర్షాలు, ఈదురుగాలులకు మొక్కజొన్న పంట నేల మట్టమైందని, పంట చేతికొచ్చే సమయంలో కోలుకోలేని దెబ్బతో నష్టం వాటిల్లిందని నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వేరబెల్లిడిమాండ్ చేశారు, .ఈ సందర్భంగా మండలంలోని కొండాపూర్, ద్వారక, పెద్దపేట,లక్ష్మీకాంతపూర్, గ్రామాల్లో నేలకొరిగిన మొక్కజొన్న పంటను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో సోమవారం కురిసిన గాలి వానకు మండలంలో దాదాపు 955 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు.
రైతులకు ఒకొక్క ఎకరాకు రూ.30వేలు ఖర్చయిందని, గాలికి పంట నేలకొరగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో వైపు మొక్కజొన్నకు మద్దతు ధర లేదన్నారు. మద్దతు ధర రూ.2400 అయినప్పటికీ దళారులు రూ.1600 నుండి రూ.1800కు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. కాబట్టి ప్రభుత్వమే జొన్న పంటను మద్దతు ధరకు కొనేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు పసల్ బీమా యోజన పథకం అమలు చేయాలని కోరారు, అకాల వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బిజెపి నాయకులు,ముకేశ్ గౌడ్, గోపతి రాజయ్య,పత్తిపాక సంతోష్, మాదాసు సుమన్ రాస శ్రీనివాస్, సంజీవ్, ఢంకా లక్ష్మణ్,రైతులు పాల్గొన్నారు.
