ఆలేరును రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలి..

ఆలేరును రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలి..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రాన్ని ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని అఖిలపక్ష కమిటీ కోరింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రెవెన్యూ డివిజన్ ను ప్రకటిస్తామని ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అఖిలపక్ష కమిటీ నాయకులు అన్నారు.

1952 నుండి పాత తాలూకా కేంద్రంగా, నియోజకవర్గ కేంద్రంగా ఉండి దశాబ్దాలుగా రెవెన్యూ డివిజన్ కాదగిన సంపూర్ణ అర్హతలు కలిగిన ఆలేరును ప్రజల చిరకాల కోరిక మేరకు డివిజన్ గా ప్రకటిస్తూ ప్రభుత్వ పక్షాన ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పారు. అఖిలపక్ష కమిటీ కన్వీనర్ పసుపునూరి వీరేశం, కో కన్వీనర్లు చెక్క వెంకటేష్, మొరిగాడి శేఖర్, బడుగు జహంగీర్,పుట్ట మల్లేష్, ఉప్పలయ్య, కామిటికారి అశోక్, జూకంటి పౌల్, నమిలే అంజిబాబు, ఎలగల కుమారస్వామి పాల్గొన్నారు.

Leave a Reply