ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి..

ఆలేరు, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడిచిపోయినా కాలయాపన చేస్తూ ఉద్యమకారులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడం నిబద్ధతలేనితనానికి నిదర్శనమని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మలిదశ తెలంగాణ ఉద్యమకారుల వేదిక కన్వీనర్ మొరిగాడి వెంకటేష్ కో-కన్వీనర్ ఇక్కిరి శ్రీనివాస్ అన్నారు. ఆలేరులో శనివారం జరిగిన మలిదశ ఉద్యమకారుల సమావేశంలో వారు మాట్లాడారు.
అర్హులైన ప్రతి ఒక్క ఉద్యమకారునికి ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రతిఫలాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు . ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 250 గజాల ప్లాటు,హెల్త్ కార్డు,తెలంగాణ ఉద్యమ పింఛన్, ఇందిరమ్మ ఇల్లు తదితర హామీల అమలుకు కార్యాచరణ వెంటనే ప్రారంభించాలని అన్నారు. హామీల అమలు జరగకపోతే ఉద్యమకారులే ఉద్యమాలు చేయక తప్పదేమో అని వారు అభిప్రాయపడ్డారు.
సమావేశంలో ఆడెపు బాలస్వామి,పిక్క శ్రీనివాస్, జంపాల శ్రీనివాస్,పూల నాగయ్య,ఆర్ జనార్దన్, మొరిగాడి ఇందిర, మందుల విజయ, గడ్డం నాగరాజు, మొగలగాని మల్లేశం, అంగడి అరవింద్,సూదగాని ఉదయ్, ఇక్కిరి కుమార్, పాశికంటి శ్రీనివాస్, పుట్ట కృష్ణ, మొరిగాడి అశోక్,నీల రామన్న,కందగట్ల నరేందర్, జహంగీర్, దేశాయిరెడ్డి, హరికృష్ణ, సర్వర్ పాషా, కుడికాల భాను ప్రసాద్, నీలయ్య,జయరాం నాయక్, ఎండి మదార్,మురళి,కవిత సుజాత పాల్గొన్నారు.
