పనులు పరిశీలిస్తున్న మున్సిపల్ కౌన్సిలర్..

పనులు పరిశీలిస్తున్న మున్సిపల్ కౌన్సిలర్..
కౌన్సిలర్ మనోహర్ కృషితో దీర్ఘకాలిక డ్రైనేజీ సమస్య పరిష్కారం
జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఐదో వార్డులో దీర్ఘకాలిక సమస్యగా ఉన్న డ్రైనేజీ సమస్య మున్సిపల్ వార్డు కౌన్సిలర్ వట్టెం మనోహర్ పరిష్కారమైంది. సోమవారం ఐదో వార్డు పరిధిలోని గౌతమి స్కూల్ ప్రాంతంలో చాలా కాలంగా ప్రజలు కోరుతున్న సిమెంట్ రోడ్డు నిర్మాణం, ఆ ప్రాంతంలో ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తూ పక్కా డ్రైనేజీ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఐదో వార్డు కౌన్సిలర్ వట్టెం మనోహర్ మాట్లాడుతూ చాలాకాలంగా డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక గౌతమి స్కూల్ ప్రాంతంలో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని సమస్యను మున్సిపల్ కమిషనర్ చైర్మన్ కు తెలియజేయడం జరిగిందని అలాగే నూతన సిమెంట్ రోడ్డు, పూర్తిస్థాయిలో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు అధికారులతో మాట్లాడి ప్రతిపాదనను చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జరుగుతున్న పనులను పరిశీలించడం జరిగిందని వివరించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్న మెట్లు ఆక్రమణలు లెవలింగ్ చేసి కొద్ది రోజుల్లో డ్రైనేజీ నిర్మాణ పనులు సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతాయని తెలిపారు.
