గుండెపోటుతో గవర్నమెంట్ టీచర్ మృతి

పర్వతగిరి, ఆంధ్రప్రభ : విధులు నిర్వహిస్తూనే గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని లోని టూక్యా నగర్ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్న చంద్రశేఖర్ (46) సోమవారం ఉదయం పాఠశాలకు హాజరయ్యాడు. ఈ క్రమంలో తరగతిగదిలో గుండెపోటుతో కుప్పకూలాడు. గమనించిన స్థానికులు నెక్కొండలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు.

Leave a Reply