రాజేశ్వరరావు సేవలను గుర్తిస్తూ సత్కారం

రాజేశ్వరరావు సేవలను గుర్తిస్తూ సత్కారం
గంపలగూడెం, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు చెరుకూరి రాజేశ్వరరావును తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి, మానవ వనరులు, ఐటి, ఆర్టిజిఎస్ శాఖ మంత్రి నారా లోకేష్ అభినందించారు. ఆదివారం మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు.
రాజేశ్వరరావు గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో సేవలు అందించడంతో పాటు గ్రామ సర్పంచ్, మండల పరిషత్ అధ్యక్షుడు, డిసిఎంఎస్ డైరెక్టర్ తో పాటు వివిధ హోదాలు నిర్వహించి ప్రజలకు అందించిన సేవలను గుర్తిస్తూ పార్టీ సీనియర్ నాయకుడుగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన్ను సత్కరించి బహుమానం అందజేశారు.
