నివాళులర్పించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి..

నివాళులర్పించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి..
మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండలం రావిగూడెం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకుడు గుర్రం శ్రీను తండ్రి గుర్రం వీరయ్య ఇటీవల మరణించిన విషయం తెలిసి మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈరోజు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చిన ప్రభాకర్ రెడ్డి ధైర్యంగా ఉండాలని సూచిస్తూ అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మందుల సత్యం,ప్రధాన కార్యదర్శి పగిల్ల సతీష్,సంయుక్త కార్యదర్శి మాధనబోయిన పరమేష్,దోటి కరుణాకర్,బండారు శ్రీనివాస్,పందుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
