నూతన కోఆప్షన్ సభ్యులకు అభినందన
నూతన కోఆప్షన్ సభ్యులకు అభినందన
ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీలో నూతన కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన ఎం ఎస్ విజయ్ కుమార్, చింతకింది మురళి లను యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఇందిరా కాంగ్రెస్ భవన్ లో బుధవారం పలువురు అభినందించి సన్మానించారు. టిపిసిసి ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎంఏ ఎజాస్, కౌన్సిలర్లు పస్తం ఆంజనేయులు, జూకంటి సంపత్, నాయకులు కలకుంట్ల లోకేష్, మల్లెల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
