జైనూర్‌ను ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలి

జైనూర్‌ను ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలి

  • మాడవి ఆనందీశ్వర్ డిమాండ్

జైనూర్, ఆంధ్రప్రభ : మొన్న పార్లమెంట్లో ప్రతిపాదించిన కొత్త నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలాన్ని ప్రత్యేక నియోజక వర్గంగా ప్రకటించాలని ఆదివాసి పర్ధన్ పురోహిత్ సేవ సంఘ0 జిల్లా జాయింట్ ప్రధాన కార్యదర్శి మాడవి ఆనందీశ్వర్ కోరారు. అయన ఆదివారం ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు అన్ని రంగాల్లో వెనుకబడినజైనూర్,లింగాపూర్, సిర్పూర్ (యు ), నార్నూర్, కేరమేరి,మండల ప్రాంతలకు సరైన గుర్తింపు లభించలేదని ఆయన తెలిపారు.

ముఖ్యంగా విద్యవైద్యరంగలోవెనుకబాటులో ఉందన్నారు. రవాణా సౌకర్యాలు సైతం లేవనన్నారు జైనూర్ మండల్లని నియోజకవర్గం గా ప్రకటిస్తే ఆ ప్రాంతంలోని ఆదివాసులు విధాలుగా సమగ్ర అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. అలాగే ఆ ప్రాంత ఆదివాసులతో పాటు అన్ని వర్గాలు ఎస్టి, ఎస్సి, బీసీ, మైనార్టీ,ఆర్థికంగా సామాజిక రాజకీయంగా అభివృద్ధి చెందడానికి ఇది ఎంతగానో తోడుపడుతుందన్నారు. ఈ అంశాన్ని పార్టీ విభేదాలు పక్కనపెట్టి అందరూ కలిసి ఉద్యమించాలని ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన అంశమని తప్పనిసరిగా జైనూర్, మండల్లని నియోజవర్గంగా ఏర్పాటు అయ్యేవరకు కుమురం భీం స్ఫూర్తితో పోరాడుదాం అని పిలుపునిచ్చారు.

లింగపూర్, సిర్పూర్ యూ, నార్నూర్, కేరమేరి,ప్రాంతాలకు తీవ్ర అన్యాయంజరుగుతుందన్నారు. ఇటు ఐ. టి డి. ఎ లో అటు కుమ్రం భీం జిల్లా కేంద్రం ఉన్నప్పటికీ ఈ ప్రాంత వాసులకు సరైన ప్రాధాన్యత ఎక్కడ దక్కడం లేదన్నారు. ప్రభుత్వ పరంగా గాని సామాజికంగా కాని ఈ ప్రాంత వాసులకు ఏ మాత్రం తరతరాలుగా తీరని అన్యాయం జరుగుతుందన్నారు.

త్రాగునీటి ప్రాజెక్టు లేక వర్షాల దార పంటల పైన ఇక్కడ ప్రజలు ఆధారపడాల్సి వస్తుందని అన్నారు. అదేవిధంగా చిన్నపాటి పరిశ్రమలు సైతం లేక నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక పట్టణ ప్రాంతాలకు ప్రైవేటు ఉద్యోగాల కోసం పట్టణ లకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జైనూర్ కేంద్రంగా ఆసుపత్రి ఉన్న సరైన సదుపాయాలు లేక తగినంత వైద్యులు లేరు సంబంధించిన సదుపాయాలు మాత్రం లేక చిన్నపాటి వైద్యానికిఆదిలాబాద్,కరీంనగర్ హైదరాబాద్కు రోగులను తీసుకుపోయే పరిస్థితి ఉందని పేర్కొన్నారు.

Leave a Reply