29thMarchCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

29thMarchCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
29thMarchCartoon | ట్రంప్ పాలనలో కోతలు, వాతలు
యుద్ధకాంక్షతో ప్రపంచంపై ప్రభావం
నోబెల్ ఆశతో ట్రంప్ వైఖరి
కార్టూన్లో ట్రంప్ స్వోత్కర్ష ప్రతిబింబం
ఆంధ్రప్రభ కార్టూన్ ఔరా ప్రత్యేకత

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ట్రంపు గారి కోతలకు హద్దేదీ, పద్దేదీ? డొనాల్డ్ ట్రంపు అమెరికా పరిపాలన గురించి చెప్పాలంటే కోతలు, వాతలు తప్ప ఇంకేమున్నాయి? వాటితోనే పుణ్యకాలం కాస్తా దాటిపోతోంది. అమెరికా నిధులు కాస్తా కరిగిపోతున్నాయి. అయినా సరే అన్నిట్లో తగ్గేదేలే అంటూ ముందుకెళ్ళడం అభాసుపాలవడం అలవాటైపోయింది. ముఖ్యంగా ట్రంపులోని యుద్ధకాంక్ష, సామ్రాజ్యవాంచ ప్రపంచాన్ని తీవ్రమైన ఇంధన సంక్షోభం, ఆర్థికమాంద్యం వైపు నెట్టుతోంది. అయినా ట్రంపులో మార్పుగానీ, పశ్చాత్తాపం గానీ కించిత్తు లేవు.
ఒకపక్క యుద్ధాలకు ప్రేరేపిస్తూనే తానే ఆ యుద్ధాలు ఆపానంటూ నోబెల్ శాంతి పురస్కారం కు తనను తానే సిఫార్సు చేసుకోవడం, యుద్ధాలు చేస్తూనే తనను తానే శాంతికాముకుడిగా ప్రశంసించుకోవడం…ఇరాన్ పై బాంబులేస్తూ, అదే దేశానికి తననెవరో సుప్రీం కమాండర్ గా ఉండమన్నారంటూ ప్రకటించుకోవడం అయితే అది మితిమీరిన అహంకారం, పిచ్చో, వెర్రో తెలీని విచిత్రమైన మానసిక స్థితి ట్రంప్ లో కనిపిస్తోంది.
ట్రంపులోని ఇదే వెర్రి వైఖరిని వ్యంగ్యంగా, చమత్కారంగా చూపించిన మన ఆంధ్రప్రభ కార్టూన్ ఇది.
అద్దంలో చూసుకుంటూ, తన ఘనకార్యాలన్నీ తానే తన ప్రతిబింబానికి గొప్పగా చెప్పుకుంటూ…తనను తానే అభినందించుకుంటున్న ఈ కార్టూన్ లో ట్రంప్ హావభావాలు, స్వోత్కర్ష స్పష్టంగా కనిపిస్తున్నాయి.
గత రెండు దశాబ్దాలుగా ఆంధ్రప్రభ పాఠకులను, కార్టూన్ ఇష్టులను అలరిస్తోన్న కార్టూన్ ఫీచర్ ఔరా.
