Rain| 2–3 రోజులు తేలికపాటి జల్లులే..

Rain| 2–3 రోజులు తేలికపాటి జల్లులే..

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : గుజరాత్ ప్రాంతం వైపు అల్పపీడన వ్యవస్థ (Low Pressure Area-LPA) కదలడంతో తెలంగాణలో రాబోయే రెండు నుంచి మూడు రోజుల పాటు వర్షాలకు విరామం లభించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం గుజరాత్, కొంకణ్, కచ్ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడ వరద పరిస్థితులు నెలకొంటున్నాయి.

గురువారం (జూలై 23) రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు మాత్రమే కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షపు జల్లులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

హైదరాబాద్‌లో రోజంతా ప్రధానంగా పొడి వాతావరణమే ఉండే అవకాశం ఉంది. అయితే సాయంత్రం లేదా రాత్రి వేళల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో స్వల్ప జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి.