రంజని తండాలో అగ్నిప్రమాదం..

రంజని తండాలో అగ్నిప్రమాదం..
కుబీర్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కుబీర్ మండల పరిధిలోని రంజని తండా సమీపంలో గల శ్రీవారులు గుట్టల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తూ అడవిలో మంటలు చెలరేగడంతో గుట్ట పై ఉన్న చెట్లు, పొదలు భారీగా కాలిబూడిదవుతున్నాయి. స్థానిక గ్రామస్థుడు జాదవ్ వికాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎండల తీవ్రత దృష్ట్యా మంటలు వేగంగా వ్యాపిస్తూ అటవీ సంపదకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. గుట్టపై ఉన్న విలువైన వృక్షాలు, పశువుల మేత అంతా అగ్నికి ఆహుతవుతోంది. మంటలు అదుపులోకి రాకపోవడంతో పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులు స్పందించి, మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టాలని, అటవీ సంపదను కాపాడాలని రంజని తండా వాసులు కోరుతున్నారు.
