ఘనంగా మాజీ ఎమ్మెల్యే పోతిన చిన్నా వర్ధంతి
ఘనంగా మాజీ ఎమ్మెల్యే పోతిన చిన్నా వర్ధంతి
భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ వన్ టౌన్ పాతబస్తీలో ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే పోతిన చిన్నా 29వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం రాజా హై స్కూల్ వద్ద ఏపీ నగరాల సంఘం 50 వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పోతిన చిన్నా కాంస్య విగ్రహానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి చేతుల మీదగా జ్యోతి ప్రజ్వలన చేసి, పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన నగరాల ప్రముఖులు పోతిన చిన్నా విజయవాడ నగర అభివృద్ధికి చేసిన కృషిని, అదేవిధంగా నగరంలో అనేక కార్మిక సంఘాలకు చేసిన సేవలను స్మరించుకుంటూ కొనియాడారు. ఈ సందర్భంగా ఏపీ నగరాల సంఘం ఆధ్వర్యంలో మాజీ మేయర్ చేతులు మీదగా విజయవాడ వస్త్రలత ముఠా కార్మికులను సత్కరించి, వారికి నూతన వస్త్రాలను బహుకరించారు. అనంతరం అల్పాహార విందును ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాయన బాబుజి (బాబ్జి) కోశాధికారి రాజగిరి సోమేశ్వరావు , పిళ్ళా మోహన్ రావు, ముదిలి మోహన్ రావు, ఈది సూరిబాబు, పోతిన చిన్నా కుమారుడు పోతిన భాస్కరరావు, ఏపీ నగరాల యువజన సంఘం అధ్యక్షులు బాయిన బెనర్జీ , ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు గూడెల మణికంఠ, యువజన సంఘము సభ్యులు, అనేక కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు ,జిల్లా నగరాల సంఘం అధ్యక్షులు బెవర శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కామందుల నరసింహారావు, ఇల్లిపిల్లి మూర్తి, మజ్జి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
