TG | ఆత్మహత్య

TG | ఆత్మహత్య

TG | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వికారాబాద్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.

తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం కేసారం గ్రామంలో ఓ వ్యక్తి సెల్ టవర్‌పై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడిని నాగరాజుగా గుర్తించారు.

తండ్రి ఆస్తి విషయంలో తలెత్తిన వివాదంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ దారుణానికి పాల్పడ్డాడని స్థానికులు అనుమానిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆత్మహత్యకు గల అసలు కారణాలను పోలీసులు విచారిస్తున్నారు.

Leave a Reply