Revanth Reddy | రూ.700 కోట్లతో భారీ ఆలయ నిర్మాణం

Revanth Reddy | రూ.700 కోట్లతో భారీ ఆలయ నిర్మాణం

Revanth Reddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మూసీ నది పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

మూసీ రివర్‌ఫ్రంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణానికి సంబంధించిన రూపకల్పనను సిద్ధం చేశారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన వీరభద్రస్వామి ఆలయం సమీపంలో ఈ కొత్త ఆలయాన్ని నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు.

సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో రూ.700 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. ఆలయంలో ఆకర్షణీయంగా నిలిచే విధంగా వంద అడుగుల ఎత్తుతో గాలిగోపురాన్ని నిర్మించేలా ప్రణాళికలు రూపొందించారు.