27thMarchCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

27thMarchCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

27thMarchCartoon | వ్యవస్థీకృత లోపాలు.. భగవంతుడికే ఎరుక!
ప్రభుత్వాల నిర్లక్ష్యం.. అంతుచిక్కని అనుమానాలు!
‘ఔరా’ కార్టూన్.. ఆంధ్రప్రభ ప్రత్యేకం

27thMarchCartoon
27thMarchCartoon

27thMarchCartoon | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: మార్చ్ 26 గురువారం ఉదయం ఓ బస్సు దగ్ధమైన సంఘటన పలువురిని కలచివేసింది. కారణాలేవైనా, కారకులెవరైనా, దాదాపు 20మంది అమాయకుల ప్రాణాలు అగ్నికి ఆహుతైపోయాయి. అతివేగమో, బస్సు కండిషనో, అజాగ్రత్తనో మొత్తానికి ప్రయాణికుల ప్రాణాలపాలిట శాపమైందేమిటో తెలియదు. ఇలాంటి సంఘటనలు, ఘోరమైన ప్రమాదాలు ఉలిక్కిపడేలా చేస్తాయి. రోజూ కొన్ని వేల బస్సులు, అనేక వాహనాలు రోడ్లమీద తిరుగుతున్నాయి. ఏది సురక్షితం? ఎందులో ప్రయాణించాలి అని అయోమయానికి గురిచేస్తాయి.

డ్రైవర్ల ఫిట్ నెస్ రూల్స్ ఏమవుతున్నాయో? బస్సుల ఫిట్ నెస్ పరీక్షలు ఎవరు చేస్తున్నారో? ఎవరు చూస్తున్నారో ఆ భగవంతుడికే తెలియాలి. ఏ ಪಾపం వెనుక ఏ లాభం ఎవరి నుంచి ఎవరికి చేతులు మారుతుందో కానీ, బలయ్యేది మాత్రం అమాయకులే.

హృదయవిదారకమైన ఈ బస్సుప్రమాదం వెనుక ఎన్ని కారణాలో. గాయపడిన, చనిపోయిన వారికి, వారి కుటుంబాలకి నష్టపరిహారాలిచ్చి చేతులు దులుపుకునే ప్రభుత్వాలు నిబంధనలనెందుకు కఠిన తరం చెయ్యరు? చలానాలు వసూలు చెయ్యడానికే పరిమితమైన అధికారులు భద్రతా చర్యలను ఎందుకు సీరియస్ గా పరిగణించరు? అంతుచిక్కని అనుమానాలెన్నో.

అన్నీ వెరసి, ప్రయాణికుల పాలిట మృత్యురూపాలుగా మారుతున్న వైనాన్ని సింపుల్ గా చూపించిన కార్టూన్ ఇది. బస్సుని ప్రమాద సంకేతంగా కపాలం రూపంలో చూపించడం వెనుక, ప్రమాదానికి గురైన బస్సు గురించి నిగూఢ అర్థాలెన్నో. ఆంధ్రప్రభ అందించిన కార్టూన్ ఇది.

గత రెండు దశాబ్దాలుగా ఆంధ్రప్రభ పాఠకులను, కార్టూన్ ఇష్టులను అలరిస్తోన్న కార్టూన్ ఫీచర్ ఔరా.

Leave a Reply