కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు..

కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు..
ఆస్పత్రి ముందు ధర్నా చేస్తున్న బాధితులు
భువనగిరిలో హృదయ విచారకర సంఘటన
చిన్న పిల్లాడి పై వీధి కుక్కల దాడి
కుక్కల దాడి లో కన్ను గుడ్డు ఊడి పడిన సంఘటన
అల్లాడుతున్న బాలుడు
ప్రభుత్వ ఆసుపత్రి ముందు ప్రజల ధర్నా
భువనగిరి, ఆంధ్రప్రభ : జిల్లా కేంద్రంలోని తారక రామా నగర్ లో బాలుడు పై కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసిన సంఘటన హృదయ చారకరంగా మారింది. అల్లాడుతున్న చిన్న బాలుడు పరిస్థితి చూసి వార్డు ప్రజలు కంటతడి పెట్టారు. వివరాల ప్రకారం పట్టణంలోని తారక రామా నగర్ కు చెందిన బూగభట్ల శ్రావణి రాహుల్ దంపతుల 4 సంవత్సరాల కుమారుడు ప్రియాన్స్ ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి దీంతో బాలుడికి తీవ్ర గాయాలై కన్ను గుడ్డు ఊడి కింద పడింది. బాలుడిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స కోసం బాలుడిని హైదరాబాదు కు తరలించారు.
ప్రభుత్వ ఆసుపత్రి ముందు వార్డు ప్రజల ధర్నా…

పట్టణంలో వీధి కుక్కల బెడద గురించి మున్సిపల్ అధికారులకు విన్నవించిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ తక్షణమే అధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్ర ఆస్పత్రి ముందు రాస్తారోకో ధర్నా చేపట్టారు. వెంటనే స్ట్రె డాగ్స్ నియంత్రణ కార్యక్రమం చేపట్టాలని పిల్లల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని మన చేశారు.
