Prashna-Ravan-Arrested : ప్రశ్న రావణ్ మళ్లీ అరెస్ట్..Andhra Prabha Crime News

Prashna-Ravan-Arrested : ప్రశ్న రావణ్ మళ్లీ అరెస్ట్..Andhra Prabha Crime News

  • ఆందోళనకు జనసేన రెడీ
  • బందరులొ ఉద్రిక్తత
  • ఇటు బెయిల్​.. అటు అరెస్టులు
  • సోషల్​ మీడియాలో తీవ్ర చర్చ

మచిలీపట్నం – ఆంధ్రప్రభ

యూట్యూబర్ ప్రశ్న రావణ్ ను మచిలీపట్నం పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున కాకినాడ నుంచి ఇనగుదురు పోలీసు స్టేషన్​ రకు తరలించారు. ఈ సమాచారంతో పెద్ద సంఖ్యలో జససేన కార్యకర్తలు పోలీసు స్టేషన్​ కు బయలు దేరారు. ఉద్రిక్త పరిస్థితి నెలకొనే స్థితిలో ఇనకుదురు స్టేషన్​ సమీపంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రావణ్ని అరెస్ట్ చేసిన పోలీసులు శుక్రవారం తెల్లవారు జామున మచిలీపట్నం తీసుకొచ్చారు. కాకినాడలో రావణ్​ పై జనసైనికులు కోడిగుడ్లతో విసిరి దాడికి యత్నించారు. మచిలీపట్నంలో అటువంటి సంఘటనలు జరగకుండా రావణ్ కు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Prashna-Ravan-Arrested : ఇనగుదురు వైపు జనసైనికులు :-

యూట్యూబర్ ‘ప్రశ్న రావణ్’ అరెస్ట్ తో మచిలీపట్నంలోని ఇనగుదురు పోలీస్ స్టేషన్ కు జనసైనికులు తరలివస్తున్నారు. దీంతో శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించిన పోలీసులు.. అక్కడకు వస్తున్న జనసైనికులను వెనక్కి పంపుతున్నారు. ఎలాంటి అల్లర్లకు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సౌమ్యంగా ఉండే మా నాయకుడు పవన్ కళ్యాణ్ ను విమర్శించడం తగదని, దీని వెనక వైసిపి కుట్ర దాగి ఉందని జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను విమర్శించిన వ్యక్తి పై కఠిన చర్యలు తీసుకోవాలని జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రావణ్ ను పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు.

Prashna-Ravan-Arrested : అసలు కేసులేంటీ..

జూన్ 28న ఏలూరులో జరిగిన ‘దళిత క్రైస్తవ సమర శంఖారావం’ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్‌లను ఉద్దేశించి రావణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురానికి చెందిన జనసేన నాయకుడు బొజ్జా కుమార్ బాబు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.సామాజిక విద్వేషాలు ఒక పాఠశాలలో గొడవను కులాల మధ్య వివాదంగా చిత్రీకరిస్తూ, వివిధ సామాజిక వర్గాలు , రాజకీయ గ్రూపుల మధ్య శత్రుత్వాన్ని పెంచేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడారనే ఆరోపణలు ఉన్నాయి.

Prashna-Ravan-Arrested : ఇటు బెయిల్​.. అటు అరెస్టు

జనసేన పార్టీ నాయకులు, మద్దతుదారులు ప్రశ్న రావణ్​ పై వివిధ పోలీస్ స్టేషన్లలో వరుసగా ఫిర్యాదులు చేశారు. జులై 1న హైదరాబాద్‌లో రావణ్‌ను పిఠాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. పిఠాపురం కేసులో బెయిల్ వచ్చిన వెంటనే, కాకినాడ సర్పవరం పోలీసులు మరో పాత కేసులో అరెస్ట్ చేశారు. ఆ కేసులోనూ కోర్టు బెయిల్ ఇచ్చింది. కాకినాడ కోర్టు నుండి విడుదలైన వెంటనే, కృష్ణా జిల్లా మచిలీపట్నం (ఇనగుదురు) పోలీసులు పవన్ కల్యాణ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో జులై 3న తెల్లవారుజామున మళ్లీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.ఈ విధంగా ఒకే వ్యవహారంలో రావణ్‌పై వరుసగా కేసులు నమోదు చేస్తూ, బెయిల్ వచ్చిన ప్రతిసారీ పోలీసులు మళ్లీ మళ్లీ అరెస్ట్ చేయటంతోఎ రాజకీయంగా, సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది