నాణ్యమైన భోజనం అందించాలి…

నాణ్యమైన భోజనం అందించాలి…

విద్యార్థినిల భద్రత ముఖ్యం
అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్

నాగర్ కర్నూల్, ఆంధ్రప్రభ : విద్యార్థినిలకు నాణ్యమైన భోజనం అందించాలని నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ ఆదేశించారు. గురువారం జిల్లాలోని పెద్దకొత్తపల్లి కస్తూరిబా బాలికల పాఠశాల ను ఆకస్మికంగా తనిఖీ చేసారు. పాఠశాల రికార్డులు, భోజన వసతి సౌకర్యాలను పరిశీలించి భోజన నాణ్యతలో మరియు విద్యార్థినుల భద్రత గురించి సిబ్బందిని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో డిఈ ఓ రమేష్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply