రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా కృష్ణ….

రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా కృష్ణ….

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహకారదర్శిగా సలీం…
సేవలకు గుర్తింపుగా బిజ్వార్ వాసులకు కీలక పదవులు…

ఊట్కూర్, ఆంధ్రప్రభ : రైతు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ దోపిడీ దౌర్జన్య కుల దురంకార భూస్వాముల దౌర్జన్యాలను వ్యతిరేకిస్తూ తమ ధైన శైలిలో కృషి చేస్తున్న నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ గ్రామానికి చెందిన ఇద్దరు నేతలకు కీలక పదవులులభించాయి. కామారెడ్డి లో జరిగిన ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రథమ మహాసభలో బిజ్వార్ గ్రామానికి చెందిన కృష్ణ, కృష్ణారెడ్డిని రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఎంపిక చేయగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా సలీం లను ఎన్నుకున్నారు.

అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన కృష్ణ పేద ప్రజలను అక్కున చేర్చుకుని వారి సమస్యలపై పోరాడుతూ ప్రజలను చైతన్యం చేసి సమస్యల్లో ముందుండి ఎన్నో పోరాటాలుచేసి ప్రజలకు అండగా నిలవడంతో రాష్ట్ర జిల్లా స్థాయిలో పలు పదవులు పొంది రాష్ట్ర అధ్యక్షులుగా ఎంపికయ్యారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సలీం తనదైన శైలిలో పోరాటపటమను ప్రజల్లోకి తీసుకువెళ్లి పలు సమస్యలు పరిష్కరిస్తూ పార్టీ మన్ననలు పొందారు.

వెనుకబడిన నారాయణపేట జిల్లా కు చెందిన ఇద్దరు నేతలకు రైతు కూలీ సంఘం లో కీలక పదవులు వరించడంతో ఈ ప్రాంతంలో రైతు వివిధ కార్మిక సంఘాల సమస్యలపై పోరాటం చేసి పరిష్కరించే నాయకులను ఎన్నుకున్నారని సర్వతార్షం వ్యక్తం చేస్తున్నారు. బిజ్వార్ గ్రామ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ నాయకులు గోవర్ధన్ రెడ్డి తదితరులుహర్షం వ్యక్తం చేస్తున్నారు.