పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి

పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం
ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్

గూడూరు – ఆంధ్రప్రభ : గూడూరు మండలంలోని పలు గ్రామాల్లో రూ. 12,61,099 లక్షల రూపాయల సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు మొత్తం రూ.50 వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిదిని ఎమ్మెల్యే కవిత కృష్ణ ప్రసాద్ అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజలకు అత్యవసర పరిస్థితిలో ఆర్థిక భరోసాని ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదిస్తే తక్షణమే సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

పెడన నియోజకవర్గం లో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తామని, పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గలో అనేక మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందించామని భవిష్యత్తులో కూడా అవసరమైన కుటుంబానికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.

Leave a Reply