క్షయ వ్యాధిని సమూలంగా నిర్మూలిద్దాం..

క్షయ వ్యాధిని సమూలంగా నిర్మూలిద్దాం..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : క్షయ(టీబీ) వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఊట్కూర్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు సంతోషి, భవాని పిలుపునిచ్చారు. మంగళవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం పురస్కరించుకొని అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షయవ్యాధి అపోహలు చెందకుండా సకాలంలో వ్యాధిని గుర్తిస్తే ప్రభుత్వం ఉచితంగా మందులు పంపిణీ చేస్తుందన్నారు.

ప్రజలు క్షయ వ్యాధి లక్షణాలు నివారణ పద్ధతులు పాటించి సకాలంలో చికిత్సలు చేసుకోవడం వల్ల వ్యాధి పూర్తిగా తగ్గుతుందన్నారు. క్షయ వ్యాధి నిర్మూలన మన అందరి బాధ్యతగా భావించి వ్యాధిని సమూలంగా నిర్మూలిద్దామని అన్నారు. క్షయ వ్యాధి సోకితే ప్రభుత్వం ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసిన అనంతరం జబ్బు తగ్గే వరకు మందులు పంపిణీ చేస్తుందన్నారు.

ఆరోగ్య కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి క్షయ వ్యాధిపై అవగాహన కల్పించాలన్నారు. క్షయ టీబి వ్యాధి లక్షణాలు నివారణ చర్యలు తదితర అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు నర్సింగమ్మ, మణిమాల, ఏఎన్ఎంలు నాగజ్యోతి శారద, ఆరోగ్య సిబ్బంది నరేష్, గౌరమ్మ, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.