మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

చిట్యాల, ఆంధ్రప్రభ ; మున్సిపల్ కార్మికుల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కనీస వేతనం మున్సిపల్ కార్మికులకు అందించాలని, గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ జరిపే చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెలుతున్న కార్మికుల డి.సి.యం ర్యాలీ ని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు అవిశెట్టి శంకరయ్య, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ సభ్యులు పాల లక్ష్మయ్య, జిల్లా కమిటీ సభ్యులు మేడి శోభ,జనపాల జ్యోతి,యమున, అండాలు, ధనలక్ష్మి,వరమ్మ, కిషన్, శేఖర్,రమణ, నరేష్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
