రిపోర్టర్ కుటుంబాన్ని పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్

రిపోర్టర్ కుటుంబాన్ని పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: భీమ్‌గల్ మండలం జాగిర్యాల్ గ్రామానికి చెందిన ఈనాడు రిపోర్టర్ అప్పాల శ్రీనివాస్ తల్లి రాజవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ బుధవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, రాజవ్వ మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ కొనపత్రి శ్రీనివాస్, కమ్మర్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బి. స్వామి, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, మాజీ సర్వసమాజ్ కమిటీ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, ముచ్కూర్ కోరాడి రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
