రుద్రూర్ ఆర్టీసీ బస్సు ప్రమాదం

రుద్రూర్ ఆర్టీసీ బస్సు ప్రమాదం
- నుజ్జునుజ్జైన ఆర్టీసీ బస్సు, లారీ
- 20మందికి తీవ్ర గాయాలు
- క్షేత్రగాత్రులను 108 లో ఆస్పత్రికి తరలింపు
రుద్రూర్, ఆంధ్రప్రభ : రుద్రూర్ మండలంలోని జవహర్ నగర్ కాలనీ వద్ద ఆర్టీసీ బస్సు,లారీ ఢీకొన్న ఘటనలలో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. రుద్రూర్ మండలంలోని నేషనల్ హైవే పనులు జరుగుతున్న రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం వర్ని వస్తున్న లారీ బోధన్ ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వెళుతున్న రుద్రూర్ లోని జవహర్ నగర్ కాలనీ గల అంబం వద్ద లారీ ఆర్టీసీ బస్సు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్లకు కాళ్లు క్యాబిన్లో ఇరుక్కపోయినాయి. 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి.

వారిని ఆరు 108 బండ్లలో క్షేత్రగాతులను బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్సై సాయన్న ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

