జొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి…
జొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి…
డోంగ్లి, ఆంధ్రప్రభ : డోంగ్లి మండల కేంద్రంలో జొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమం లో తహాసిల్దార్ రంజిత్ కుమార్ వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ మండలంలో 1325 ఎకరాల్లో జొన్న సాగవుతుందని కోతలు పూర్తి అయి 40 గడుస్తుందని 26500 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందన్నారు.
మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రం లేకుంటే ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లడానికి హమాలి, రవాణా ఖర్చులకు మండలం రైతులందరికీ 53లక్షల అదనకు భారంతో పాటు వ్యవసాయ పనులకు ఆటకంకలుగుతుందని అధికారులు ప్రత్యేక దృష్టిసారించి డోంగ్లి మండల కేంద్రంలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు రవి పటేల్, లక్ష్మణ్ గోండా, రఘుగోండా తదితరులు పాల్గొన్నారు.
