నరేందర్ రెడ్డి ఇకలేరు..
నరేందర్ రెడ్డి ఇకలేరు..
-చిరకాల మిత్రుడి కోల్పోవడం తీరని లోటు…
-మరణ వార్త జీర్ణించుకోలేకపోతున్నాను
-కాంగ్రెస్‌కు తీరని లోటు
-ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కడియం
స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ సీనియర్ నాయకులు, స్టేషన్ ఘన్ పూర్ వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్, అత్యంత ఆప్త మిత్రుడైన చింతకుంట్ల నరేందర్ రెడ్డి మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని మంగళవారం ఓ ప్రకటనలో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. నిన్న సాయంత్రం ఆసుపత్రికి వెళ్లి నరేందర్ రెడ్డినీ కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నాను. కానీ తెల్లవారేసరికే ఇంతటి విషాదకర వార్తను విని నమ్మలేకపోతున్నానని అన్నారు.
గత 30 ఏళ్ల నా రాజకీయ జీవితంలో అన్నివేళలా నా వెంటే ఉంటూ నాకు అండగా నిలిచిన చిరకాల మిత్రున్ని కోల్పోవడం అత్యంత బాధాకరమని.. ఇది వ్యక్తిగతంగా నాకు, స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. నరేందర్ రెడ్డి మరణ వార్తను జిర్ణించుకోలేకపోతున్నానని బాధతప్త హృదయంతో తెలిపారు. నరేందర్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియ జేశారు.
