నాగరాజు కుటుంబానికి మిత్రులు అండ..

నాగరాజు కుటుంబానికి మిత్రులు అండ..
రూ. ఒక లక్ష ఆర్థిక సహకారం
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని హనుమాన్ నగర్ కు చెందిన 1998-99 పదవ తరగతి పూర్వ విద్యార్థి, బాల్యమిత్రుడు ఐతరాజు నాగరాజు ఇటీవల అనారోగ్యంతో మరణించగా నాగరాజు కుటుంబానికి ఆయన బాల్యమిత్రులు అండగా నిలిచి ధైర్యం చెప్పారు. సోమవారం స్నేహితులంతా కలిసి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని హనుమాన్ నగర్లోని నాగరాజు నివాసంలో ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. నాగరాజు ఆకస్మిక మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో ఉన్న నేపథ్యంలో, తమ బాల్య స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ 10వ తరగతి స్నేహితులు ముందుకు వచ్చి ఈ సహాయం అందించారు.
ఈ సందర్భంగా బాల్య మిత్రులు మాట్లాడుతూ ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, మా స్నేహానికి, బాధ్యతకు ప్రతీక. ఇలాంటి కష్టసమయంలో మనం ఒకటిగా నిలబడటం మన కర్తవ్యంగా భావించాని తెలిపారు. స్థానికులు ఈ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ, సమాజానికి ఇది ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మిత్రులు హరికృష్ణ, కృష్ణ, చిక్క శ్రీనివాస్, బొడిగె బాలకృష్ణగౌడ్, సతీష్, వెంకటేష్, అశ్విన్, నాగార్జున్, సామి, రాజచంద్ర, ఆలమ్ తదితరులు పాల్గొన్నారు.
