ఎల్లమ్మ దేవాలయానికి భక్తుల సౌకర్యార్థం బెంచీల బహుకరణ

చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని గీత కార్మికుల ఆరాధ్య దైవమైన రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం వద్ద బుర్ర రాయ మల్లమ్మ–కనకయ్యల స్మారకార్థం వారి కుమారుడు బుర్ర తిరుపతి గౌడ్ సూచన మేరకు ఆయన కుమార్తెలు బుర్ర చాందిని గౌడ్, నందిని గౌడ్ భక్తుల సౌకర్యార్థం ఎనిమిది బెంచీలను బహుకరించారు.

సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ బెంచీలను ఎలేటి రామయ్యపల్లి సర్పంచ్ కొడారి అశోక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాతగారి పేరుమీద మనవరాళ్లు భక్తుల సౌకర్యం కోసం బెంచీలు అందించడం అభినందనీయమని అన్నారు. వారికి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో నవాబుపేట మాజీ సర్పంచ్ కసిరెడ్డి సాయి సుధా రత్నాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ కొత్తూరి రాజిరెడ్డి, ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షుడు బండి సాంబయ్య, గౌడ సంఘం మాజీ అధ్యక్షుడు బుర్ర శ్రీధర్ గౌడ్, మాజీ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు తిరుపతి గౌడ్, గీత కార్మికులు బుర్ర రాజేందర్, బుర్ర రఘు, శ్రీపతి సమ్మయ్య, కట్టగాని వెంకన్న, నవీన్, చిట్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కట్కూరి మొగిలి, శ్యామల ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply