నేరాలను అదుపులో ఉంచడానికి సీసీ కెమెరాలు…

నేరాలను అదుపులో ఉంచడానికి సీసీ కెమెరాలు…

ముత్తునూరులో సీసీ కెమెరాలు అమరచాలని ఎస్సై సాయన్న

అదిలాబాద్, ఆంధ్రప్రభ : ఇంద్రవెల్లి మండలంలోని ముత్తునూరు గ్రామంలో సీసీ కెమెరాలను అమరచాలని స్థానిక ఎస్సై ఈ సాయన్న వ్యాపారస్తులను కోరారు. ఆదివారం ముత్తునూరు గ్రామపంచాయతీ కార్యాలయం యందు గ్రామస్తులు వ్యాపారస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల కేంద్రముతో పాటు ముఖ్య గ్రామాలైన ముతూనూరు, దనోరా, గ్రామాలలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు అమర్చాలని పేర్కొన్నారు ఎలాంటి నేరాలు అయినా సీసీ కెమెరాల వల్ల నేరస్తుని నేరుగా పట్టుకోవచ్చని ఈ కెమెరా ల వల్ల నేరాలు సైతం తగ్గుతుందని తెలిపారు.

కావున గతంలో గ్రామంలో పెట్టిన సీసీటీవీ కెమెరాలను మరమత్తు చేయవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ రీతే విట్టల్ గ్రామ వ్యాపారస్తులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు