వడదెబ్బ తగిలి డ్రీహైడ్రేషన్ తో..

వడదెబ్బ తగిలి డ్రీహైడ్రేషన్ తో..


జన్నారం, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని బస్టాండ్ పరిసరాల్లో చనిపోయిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉందని స్థానిక ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ శుక్రవారం ఉదయం తెలిపారు. ఆ వ్యక్తికి 30 ఏళ్ల వయస్సు ఉంటుందని, ఆ వ్యక్తి వడదెబ్బ తగిలి డ్రీహైడ్రేషన్ అయి చనిపోయి ఉంటాడనే అనుమానం ఉందని ఆయన తెలిపారు. ఆ వ్యక్తిని ఎవరైనా గుర్తించి వివరాలు తెలిసినట్లయితే నేరుగా గాని, 8712656547 ఈ నెంబర్ కు గాని ఫోన్ చేయాలని ఆయన సూచించారు.

Leave a Reply