రోగులకు మెరుగైన వైద్యం అందించాలి..
జైనూర్, ఆంధ్రప్రభ ; ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్ అన్నారు. ఆయన ఆదివారం జైనూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పరిశుభ్రత పాటించి ఆసుపత్రికి వచ్చే రోగులకు సరియైన వైద్యం అందేలా చూడాలని ఆయన కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల విషయాలు సౌకర్యాల గురించి ఆస్పత్రి వైద్య ఉద్యోగులతో అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట నాయకులు అమృత్ రావు తదితరులు పాల్గొన్నారు.
