పరకాలలో మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ నేత పరామర్శ
పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలో ఇటీవల మరణించిన పలువురు కుటుంబాలను పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ సోదా రామకృష్ణ శనివారం పరామర్శించారు.
పరకాల పట్టణంలోని 17వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గుర్రం కిషన్ తల్లి గుర్రం పుష్ప, అలాగే మున్సిపల్ సిబ్బంది బుస్స రవి, కుమార్ తండ్రి ఐలయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ సందర్భంగా సోదా రామకృష్ణ మృతుల కుటుంబాలను సందర్శించి, వారిని ఓదార్చి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు బొచ్చు సుభద్ర సాల్మన్, పసుల లావణ్య రమేష్, గుర్రం వినయ్, అలాగే నాయకులు బొచ్చు అనంత్, బొచ్చు జెమిని, మడికొండ సాంబయ్య, బొచ్చు సంపత్, బొచ్చు ప్రవీణ్, కోడెపాక రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
