అవార్డు గ్రహీత దుంప నర్సయ్యకు ఘన సన్మానం
గణపురం, ఆంధ్రప్రభ ; బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ బాపూజీ జాతీయ అవార్డు అందుకున్న మండలంలోని చెల్పూర్ గ్రామంలోనీ శ్రీ గణేష్ హోటల్ నిర్వాహకులు దుంప నర్సయ్యకు శనివారం గ్రామానికి చెందిన నాయకులు స్వీట్ అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు.
సేవారంగంలో ముందుండే నర్సయ్య భవిష్యత్తులో మరిన్ని అవార్డులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మొరంచపల్లి సర్పంచ్ నరేడ్ల తిరుపతి రెడ్డి, చెల్పూర్ మాజీ సర్పంచ్ కొత్త వెంకన్న,నాయకులు లక్కం రాములు,సూర బాబురావు, సామల సుధాకర్,కూరపాటి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
