డోర్నకల్‌లో చమురు సెగ..

డోర్నకల్‌లో చమురు సెగ..
- లీటర్ పెట్రోల్ రూ. 200
డోర్నకల్, ఆంధ్రప్రభ : డోర్నకల్ మండలంలో పెట్రోల్ కొరత సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. గత కొన్ని రోజులుగా మండల కేంద్రంలోని పెట్రోల్ బంకుల్లో స్టాక్ లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకున్న కొందరు అక్రమ వ్యాపారులు గ్రామాల్లో బ్లాక్ మార్కెట్ దందాను ప్రారంభించారు. పల్లెల్లో లీటర్ పెట్రోల్‌ను రూ.200కు పైగా విక్రయిస్తూ ప్రజలపై భారం మోపుతున్నారు.
పెట్రోల్ బంకుల్లో “నో స్టాక్” బోర్డులు కనిపించడంతో గత్యంతరం లేక వాహనదారులు అధిక ధరలకు పెట్రోల్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. అక్రమ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
